Friday, January 10, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిరాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నీలో రన్నర్ గా ఉమ్మడి, అనంతపురం జిల్లా జట్టు

రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నీలో రన్నర్ గా ఉమ్మడి, అనంతపురం జిల్లా జట్టు

విశాలాంధ్ర ధర్మవరం:: రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నీలో రన్నర్ గా ఉమ్మడి అనంత జట్టు నిలిచినట్లు ప్రభుత్వ మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ మేరీ వర కుమారి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుంటూరులో ఈనెల ఆరవ తేదీ నుంచి 8వ తేదీ వరకు నిర్వహించిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల్లో ఉమ్మడి అనంత జిల్లా జట్టు రన్నర్గా నిలిచినట్లు వారు తెలిపారు. గుంటూరులో జరిగిన ఫైనల్ టోర్నీలో కర్నూల్ ఉమ్మడి అనంత జిల్లా జట్టు తలపడగా కర్నూలు జట్టు విన్నర్గా ఉమ్మడి అనంత జిల్లా జట్టు రన్నర్ గా నిలవడం జరిగిందని తెలిపారు. ఉమ్మడి అనంత జిల్లా జట్టు తరఫున తమ పాఠశాల విద్యార్థి బృందమును మెడల్ కూడా సాధించడం జరిగిందని తెలిపారు. దీంతో బృందా అనే విద్యార్థిని పాఠశాల హెచ్ఎం మేరీ వర కుమారి తో పాటు పిఈటి అశ్విని ఉపాధ్యాయులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు