Friday, February 28, 2025
Homeజిల్లాలుఅనంతపురంఅనంతలో అగ్రగామిగా నిలుస్తున్న అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాల

అనంతలో అగ్రగామిగా నిలుస్తున్న అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాల

వ్యవసాయం, విద్య ప్రగతికి నాంది పలికిన అనంతరాముడు

విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: అనంతపురం జిల్లాలో ఉన్నత ప్రమాణాలతో సాంకేతిక బోధన , ఉపాధి కల్పన , పరిశోదాత్మక అధ్యయనం, వికాసానికి  నిలయంగా నిలుస్తున్న అనంతలక్ష్మి అనంతలో అగ్రగామిగా తనదైన ప్రతిభను చాటుతో విద్యార్థులు , తల్లిదండ్రుల హృదయాలలో చోటును సంపాదించుకుని విజయ శిఖరాలను అధిరోహిస్తూ తనదైన ముద్రను చాటుకుంది. అనంత రాముడు జన్మదినోత్సవం ,కళాశాల ఆవిర్భావ దినోత్సవం గా.. ఎన్నో మైలురాళ్లను దాటుకొని 17వ అనంతలక్ష్మి  వార్షికోత్సవ అడుగుపెడుతూ.. అనంతలక్ష్మి ఇంటర్నేషనల్ స్కూల్ , ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, పాలిటెక్నికల్ కోర్సులను ప్రవేశపెట్టి పొలాలను అందిస్తూ ఉంది. వ్యవసాయం, విద్య రెండు కళ్ళుగ భావించి..వ్యవసాయం జీవన ఆధారంగా ముఖ్యభూమికను పోషించిన అనంత రాముడు అనుతిర కాలంలోనే బిందు, డ్రిప్, సూక్ష్మ నీటి విధానంతో పండ్ల తోటలో జాతీయస్థాయిలో ప్రతిభ కనబరిచి ఉత్తమ రైతుగా, అనంతపురం జిల్లా పండ్ల తోటల సంఘం జిల్లా అధ్యక్షుడిగా తనదైన ముద్రను చాటుకున్నారు. ఇంజనీరింగ్ కోర్స్ కోసం హైదరాబాద్ ,బెంగళూరు, చెన్నైకు వలసలు వెళ్లే అవసరం లేకుండా ఉన్న ప్రాంతంలోనే విద్యార్థుల కలలు స్వప్నాలను నెరవేర్చినందుకు అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాలను ఆవిర్భవించి .. రైతుల ఆశయాలను, విద్యార్థులలో దాగివున్న సృజనాత్మక, విజయ శిఖరాలను అధిరోహించేందుకు తోడుగా.. నిలుస్తూ. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థుల ప్రతిభను వెలికితీస్తూ. పారిశ్రామిక కంపెనీలలో ఉద్యోగ కల్పనను అందిస్తూ.. తమదైన ముద్రను చాటేరు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు