పరిటాల సునీత
విశాలాంధ్ర – ధర్మవరం : కొన్ని రోజుల కిందట ధర్మవరం వ్యాపారస్తులైన కోటం ఆనంద్ శశిలపై ఆలయ సిల్క్ హౌస్ వైసీపీ నేత అవినాష్ దాడి చేయడం దారుణమని, దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని పరిటాల సునీత పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి దాడి జరిగిన సమాచారాన్ని అడిగి తెలుసుకుని, నీకు అండగా ఎల్లప్పుడూ ఉంటామని ఇచ్చారు. అనంతరం పరిటాల సునీత విలేకరులతో మాట్లాడుతూ నేడు రాష్ట్రవ్యాప్తంగా వైసిపి నాయకుల దాడులు అధికమయ్యాయి అని, ప్రజలకు తాము అండగా ఉంటామని తెలిపారు. తదుపరి జరిగిన విషయాన్ని అప్పటికప్పుడే చంద్రబాబు నాయుడుతో ఫోన్లో కూడా మాట్లాడించడం జరిగిందన్నారు. సుమారు 15 నిమిషాల పాటు చంద్రబాబుతో బాధితులు మాట్లాడడం జరిగిందన్నారు. విజయవాడలో గల వ్యాపారవేత్త అవినాష్, శశి ఇప్పటికే ఎంతో మందిని మోసం చేసినట్లు తెలిసిందన్నారు. కేవలం చీరలు అప్పుగా ఇచ్చి తిరిగి డబ్బులు అడిగినందుకే ఇలా దాడి చేయడం తనకు ఎంతో బాధను కలిగించిందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ బాధితులుగా అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇవ్వడం జరిగిందన్నారు. ఈ ఘటనపై వెని వెంటనే డిజిపి స్పందించాలని దాడి చేసిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు గైకొనాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పని కుమార్, పరిసే సుధాకర్, కమతం కాటమయ్య, అంబటి సనత్ ,మహేష్ చౌదరి, తలారి చంద్రమోహన్ బాబు, మారుతి స్వామి, చింతపులుసు పెద్దన్న, తదితరులు పాల్గొన్నారు.