విశాలాంధ్ర – జెఎన్టియుఏ: ప్రాచీన కాల పద్ధతులను నేటికీ గొప్ప ఆవిష్కరణలు అని జె ఎన్ టి యు భౌతిక శాస్త్ర ఆచార్యులు ప్రొఫెసర్ ఆర్. పద్మ సువర్ణ పేర్కొన్నారు. పివికేకే ఇంజనీరింగ్ కళాశాల (అటానమస్) హ్యుమానిటీస్ అండ్ సైన్సెస్ విభాగం ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపల్ డా. బండి రమేష్ బాబు అధ్యక్షతన జాతీయ విజ్ఞాన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రో.పద్మ సువర్ణమాట్లాడుతూ విజ్ఞాన శాస్త్రం యొక్క ఆవశ్యకతను, ప్రాచీన కాల పద్ధతులను నేటి కాలానికి అనుసంధానిస్తూ దానిలోని పరమార్ధాన్ని విద్యార్థులకు తెలియజేస్తూ ఉత్తేజపరిచారు. అనంతరం కళాశాల చైర్మన్ డాక్టర్ పల్లె వెంకట కృష్ణ కిషోర్ మాట్లాడుతూ.. విజ్ఞాన శాస్త్రాన్ని ప్రస్తుత కాలంలో అవలంబిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు సైబర్ సెక్యూరిటీల వాడకం లో ఎలా ఉపయోగిస్తున్నామో మరియు వాటి ఉపయోగాలను చక్కగా వివరించారు. కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ. మన జీవన మనుగడలో విజ్ఞాన శాస్త్రానికి ఉన్న గొప్పతనాన్ని ఉదాహరణలతో వివరించారు. కళాశాల మేనేజ్మెంట్ రెప్రజెంటేటివ్ శ్రీ కె శ్రీకాంత్ రెడ్డి , ఏవో డాక్టర్ కె మనోహర్ రెడ్డి , విజ్ఞాన శాస్త్రాన్ని ఉపయోగించుకొని సమాజానికి ఉపయోగపడే కొత్త ఆవిష్కరణలను రూపొందించాలని విద్యార్థులకు సూచించారు. ఈ బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులు ప్రదర్శించిన నమూనాలు, పోస్టర్ లు , ఫేస్ పెయింటింగులు అతిధులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కన్వీనర్ డాక్టర్ టి. లక్ష్మీ నరసప్ప, కోఆర్డినేటర్ డాక్టర్ ఎం వాసుదేవరెడ్డి , బోధన బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.