ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య యువజన సంఘం రాష్ట్ర పొలిటికల్ చైర్మన్ పెనుజూరు నాగరాజు
విశాలాంధ్ర- ధర్మవరం : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కొణి జేటి రోశయ్య లేని లోటు తీర్చలేనిదని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య యువజన సంఘం రాష్ట్ర పొలిటికల్ చైర్మన్ పెనుజూరు నాగరాజు తెలిపారు. బుధవారం పట్టణంలోని పెనుజురు నాగరాజు కార్యాలయంలో కొణి జేటి రోశయ్య మూడవ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రోశయ్య చిత్రపటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య యువజన సంఘం, సత్య సాయి జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం, పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం సభ్యులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో రోశయ్య తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారన్నారు సుమారు 50 ఏళ్ల తన రాజకీయ జీవితంలో రోశయ్య ఎన్నో పదవులు అలంకరించాలన్నారు. తమిళనాడు గవర్నర్ గా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా, శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఇలా ఎన్నో పదవులను అలంకరించిన రోశయ్య ఆర్థిక శాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలక పాత్ర వహించారన్నారు. అలాంటి మహనీయుని అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలన్నారు. ప్రత్యేకించి ఆర్యవైశ్యుల ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో పెద్దన్న పాత్ర పోషించారని ఆర్యవైశ్య సంఘాల బలోపేతానికి రోశయ్య చేసిన కృషి మరువలేనిది అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ సభ్యులు ఆర్వేటి కిషోర్, కర్ణాటకం ముకుంద, రాష్ట్ర ఆర్యవైశ్య యువజన సంఘం మీడియా కమిటీ సభ్యులు గ్రంధే శ్రీనివాసులు, సత్యసాయి జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు కలవల నాగ తేజ, పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు దేవతా శ్రీనివాస్,గౌరవ అధ్యక్షులు అంబటి అవినాష్, నామరాజ, నగర సంకీర్తన కమిటీ అధ్యక్షులు గోపా చంద్రకాంత్, విజయ్, రజిని, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొణిజేటి రోశయ్య లేని లోటు తీర్చలేనిది
RELATED ARTICLES