Sunday, April 20, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిసజావుగా జరిగిన అంగన్వాడీ వర్కర్స్ ఇంటర్వ్యూలు

సజావుగా జరిగిన అంగన్వాడీ వర్కర్స్ ఇంటర్వ్యూలు

ఆర్డిఓ మహేష్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో ధర్మవరం బత్తలపల్లి చెన్నై కొత్తపల్లి ప్రాజెక్టులకు సంబంధించిన అంగన్వాడీ వర్కర్స్, ఆయాల ఇంటర్వ్యూలు సజావుగా నిర్వహించడం జరిగిందని ఆర్డిఓ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ఆర్డీవో కోర్టు కార్యాలయ ఆవరణములో ఈ ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగింది. ధర్మవరం డివిజన్ పరిధిలోని మూడు ప్రాజెక్టులు అయినా ధర్మవరం, చెన్నై కొత్తపల్లి, బత్తలపల్లి అంగన్వాడి కేంద్రాలలోని అంగన్వాడి వర్కర్స్ ఆయాలకు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. మొత్తం మూడు మండలాలలో 161 దరఖాస్తులు రాగా, 69 మందిని రిజెక్ట్ సిడిపిఓ చేయడం జరిగింది. తదుపరి 92 మంది అర్హత గల అంగన్వాడి వర్కర్స్ కు ఆయాలకు ఇంటర్వ్యూ నిర్వహించగా 74 మంది హాజరు కావడం జరిగిందని, 18 మంది హాజరు కాలేకపోవడం జరిగిందని తెలిపారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఈ ఇంటర్వ్యూలు నిర్వహించి, కలెక్టర్ ఆదేశాల మేరకు అర్హత గల వారికి తగిన ప్రగతి వివరాలను పొందుపరిచి, నివేదికను కలెక్టర్ కార్యాలయానికి పంపడం జరిగిందని తెలిపారు. తదుపరి కలెక్టర్ ఆదేశాల మేరకు ఆయా మండలాలలో ఎంపిక కాబడిన జాబితాను ప్రకటించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం సిడిపిఓ లక్ష్మి, చెన్నై కొత్తపల్లి సిడిపిఓ కవిత, బత్తలపల్లి సిడిపిఓ సరస్వతి, ఇంటర్వ్యూకు వచ్చిన మహిళ అభ్యర్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు