బి కే భగవాన్ బాయ్
విశాలాంధ్ర ధర్మవరం;; కోపం మానసిక ఒత్తిడిని పెంచుతుందని బి కే భగవాన్ బాయ్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్బిఐ కాలనీలో గల ప్రజాతిత బ్రహ్మకుమారి కార్యాలయంలో వారు పలు విషయాలను తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కోపం మూర్ఖత్వంతో మొదలై చాలా సంవత్సరాల తర్వాత పశ్చాత్తాపంతో ముగుస్తుందని తెలిపారు. కోపమే నేరాలకు మూల కారణం అవుతుందని తెలిపారు. కోప రహిత జీవితం కోసం సానుకూల ఆలోచన అనే అంశంపై వారు వారి విషయాలను తెలియజేయడం జరిగింది అని తెలిపారు. అహంకారం వల్లనే మనసులో ప్రతికూల ఆలోచనలు ,అనుమానం, అసూయ, ద్వేషం ,ద్వేషాలు తలెత్తుతాయని తెలిపారు. అంతేకాకుండా కోపము అనేది సంబంధాలలో చేదును కూడా తెస్తుందని తెలిపారు. అందుకే ఆధ్యాత్మిక జ్ఞానమే సానుకూల ఆలోచనలకు మూలం అని తెలిపారు. ముగింపు కార్యక్రమములో ధ్యానమును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బి కే శ్రీనివాసులు భాయ్, సుధాకర్ భాయ్, క్రాంతి భాయ్, రాజు భాయ్, అశోక్ భాయ్, భగవాన్ భాయ్, తదితరులు భగవాన్ భాయ్ ను ఘనంగా సత్కరించారు.
కోపం మానసిక ఒత్తిడిని పెంచుతుంది..
RELATED ARTICLES