Tuesday, February 25, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిజిల్లా కమిటీ సభ్యులుగా అనిల్ ఎంపిక

జిల్లా కమిటీ సభ్యులుగా అనిల్ ఎంపిక

భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శిగా నామాల నాగార్జున

విశాలాంధ్ర ధర్మవరం : ఈనెల 24 25 తేదీలలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ శ్రీ సత్య సాయి 6వ జిల్లా మహాసభలు పెనుకొండ పట్టణంలో ఘనంగా జరిగాయి. ఈ రెండు రోజులు పాటు జరిగిన మహాసభలకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్నకుమార్ మాజీ విద్యార్థి సంఘం నాయకులు ఈఎస్. వెంకటేష్ గముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ మహాసభలలో రానున్న రోజుల్లో విద్యా రంగంలో వస్తున్న మార్పులు విద్యార్థుల సమస్యలపై ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలని అంశాలపై నాయకులు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఎస్ఎఫ్ఐ శ్రీ సత్య జిల్లా నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది జిల్లా ప్రధాన కార్యదర్శిగా ధర్మవరం పట్టణం చెందిన నామాల నాగార్జునని రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ధర్మవరం పట్టణం చెందిన అనిల్ ని జిల్లా కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలపై సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థుల కోసం అనేక పోరాటాలు చేయడం వల్ల ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకత్వం గుర్తించి నన్ను రెండోసారి జిల్లా కార్యదర్శిగా ఎన్నికచేయడం జరిగింది అని ఇందుకు కృతజ్ఞతలు కూడా తెలియజేశారు.స్వాతంత్రం ప్రజాస్వామ్యం సోషలిజం నినాదంతో ఎస్ఎఫ్ఐ జిల్లా నిర్మాణం చేపడుతూ ఎక్కడ విద్యార్థులకు సమస్యలు వచ్చినా తాను ముందు ఉంటానని తెలియజేస్తూ ఈ ఎన్నికకు సహకరించిన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకత్వానికి మాజీ నాయకులు వెంకటేష్ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులకు విద్యార్థులకు విప్లవ అభివందనాలు తెలియజేయడం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు