విశాలాంధ్ర ధర్మవరం:: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ పరీక్ష ఫలితాలలో ఈనెల 22వ తేదీ అనగా మంగళవారం విడుదల చేసిన ఇంటర్ పరీక్ష ఫలితాలలో శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణం సత్య సాయి నగర్ లో గల తండ్రి కె ఎస్ ప్రకాష్ తల్లి శ్యామల యొక్క మొదటి కుమార్తె కె .ఎస్. హేమా నందిని 1000 మార్కులకు గాను 990 మార్కులు సాధించినది. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ ఇంటర్ పరీక్షల్లో ఇంతటి అత్యధిక మార్కులు సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ధర్మవరం కు, శ్రీ సత్య సాయి జిల్లాకు మంచి గుర్తింపును తేవడం మాకు ఎంతో సంతోషంగా గర్వంగా ఉందని తెలిపారు. మా కుమార్తె హైదరాబాదులోని రిజనాన్స్ మౌర్య కాలేజీలో ( గర్ల్స్ క్యాంపస్) ఇంటర్ లో చేర్పించడం జరిగిందన్నారు. తెలంగాణలో 13 క్యాంపస్లు కలవని, ఇందులో మా అమ్మాయి రెండవ స్థానం సాధించడం జరిగిందని తెలిపారు. పదవ తరగతి ధర్మవరంలోని నాగులూరు గ్రామమునందుగల పిసిఎన్ఆర్ పాఠశాలలో చదవడం జరిగిందన్నారు. తండ్రిగా నేను వాళ్ళ చదువుల పట్ల ప్రత్యేక శ్రద్ధను కనపరచడంతోనే ఇటువంటి ప్రతిభ చాటడం జరిగిందన్నారు. తాను పుట్టపర్తి లోని ఎస్పీ ఆఫీసులో హోంగార్డ్ డిపిఓగా విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. తల్లి గృహిణిగా పనిచేస్తుందని తెలిపారు. ప్రస్తుతం హైదరాబాదులోని అదే కళాశాలలో ఎంసెట్ కోచింగ్ శిక్షణలో ఉంది అని తెలిపారు. నాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, ఇందులో మొదటి కుమార్తె హేమా నందిని, రెండవ కుమార్తె రమ్యశ్రీ అని తెలిపారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు, బంధు మిత్రులు, సత్య సాయి నగర్ కాలనీవాసులు హేమానందినికి ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన ఆణిముత్యం..
RELATED ARTICLES