విశాలాంధ్ర ధర్మవరం : అన్నదానం సేవ దైవ సేవతో సమానమని యువర్ ఫౌండేషన్ కోశాధికారి మోహన్ గుప్తా, వై కే. శ్రీనివాసులు, గర్రె రమేష్ బాబు మల్లికార్జున తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 300 మంది రోగులకు సహాయకులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం యువర్ ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ దాతల సహాయ సహకారములతోనే ఇటువంటి అన్న సేవ సంకల్పన కార్యక్రమం నిర్వహించడం మాకెంతో సంతృప్తిని ఇచ్చిందని తెలిపారు. దాతల సహాయం లేనిదే ఏమి చేయలేమని తెలిపారు. నేటి అన్నదాతలుగా కీర్తిశేషులు రేణిగుంట్ల బాల వెంకటయ్య జ్ఞాపకార్థం వారి కుమారులు రేణిగుంట్ల శ్రీధర్ వ్యవహరించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వారికి యువర్స్ ఫౌండేషన్ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. యువర్ ఫౌండేషన్ కంటి శిబిరాలు, నేత్రదానం తదితర సేవా కార్యక్రమాలను కొన్ని సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్. మాధవి మాట్లాడుతూ యువర్ ఫౌండేషన్ సంస్థ చేస్తున్న ఇటువంటి సేవా కార్యక్రమాలు అందరికీ స్ఫూర్తిని ఇస్తాయని తెలుపుతూ వారికి కృతజ్ఞతలను ప్రభుత్వ ఆసుపత్రి తరఫున తెలియజేశారు.
అన్నదానం సేవ దైవ సేవతో సమానం. యువర్స్ ఫౌండేషన్ ప్రతినిధులు
RELATED ARTICLES