విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ ఆవరణం ముందు గల శ్రీ అన్నమయ్య విగ్రహం వద్ద అన్నమయ్య సేవా మండలి అధ్యక్షులు పోరాల్ల పుల్లయ్య వారి శిష్య బృందం ఆధ్వర్యంలో ఘనంగా అన్నమయ్య జయంతి వేడుకలను నిర్వహించుకున్నారు. అనంతరం విగ్రహానికి వివిధ అభిషేకాలు, అర్చనలు, పూజలు అర్చకులు కొనేరా ఆచార్యులు నిర్వహించారు. అనంతరం అన్నమయ్య విగ్రహాన్ని వివిధ పూలమాలలతో అలంకరించిన వైనం అందరినీ ఆకట్టుకుంది. అనంతరం పి .పుల్లయ్య మాట్లాడుతూ హరి యువతార అతడు అన్నమయ్య అని తెలిపారు. భక్తి కవిత్వాన్ని సమాజ అభ్యుదయాన్ని సమన్వయపరిచిన సంకీర్తనచార్యుడు తాళ్లపాక అన్నమయ్య అని, ఈ అనుభవ సముద్రుడికి కీర్తనలు, శ్రీ వెంకటేశ్వర ముద్రాంగితాలు అని, తెలుగు తీయదనానికి ,భక్తి పరిమళానికి మని తోరణాలు అని తెలిపారు. సహజ సుందరమైన జాతీయాలతో సంకీర్తనలను సుసంపన్నం చేసిన సరస్వతీ పుత్రుడు అన్నమాచార్యుడు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య సేవా మండలి కమిటీ సభ్యులు, భక్తాదులు పాల్గొన్నారు.
ఘనంగా అన్నమయ్య జయంతి వేడుకలు
RELATED ARTICLES