దేశ రాజధాని ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాలలో ఈరోజు ఉదయం బలమైన భూప్రకంపనలు సంభవించిన విషయం తెలిసిందే . ఈ భూకంపంపై తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. భయాందోళనలకు గురికాకుండా ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉండాలని సూచించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. మరోసారి భూప్రకంపనలు వచ్చే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రస్తుత పరిస్థితిని అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారని మోదీ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
మరోసారి భూప్రకంపనలు వచ్చే అవకాశం.. అప్రమత్తంగా ఉండాలని మోడీ పిలుపు
RELATED ARTICLES