అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. మరో తెలంగాణ విద్యార్థి దుండగుల కాల్పుల్లో మృతి చెందాడు. నెల రోజుల క్రితం తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి దుండగుల కాల్పుల్లో మృతి చెందాడు. ఈ వార్త మరవక ముందే మరో హైదరాబాదీ యువకుడు కాల్పుల్లో మృతి చెందడం అతని కుటుంబంలో విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ చైతన్యపురి పరిధిలోని ఆర్కేపురం డివిజన్ గ్రీన్ హిల్స్ కాలనీ రోడ్ నంబర్ 2లో నివసిస్తున్న కొయ్యడ చంద్రమౌళి కుమారుడు రవి తేజ 2022 మార్చిలో అమెరికా వెళ్లాడు. అక్కడ అతను మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. ఈ క్రమంలో అమెరికా వాషింగ్టన్ లో దుండగులు జరిపిన కాల్పుల్లో రవితేజ మృతి చెందాడు. ఈ సమాచారం తెలియటంతో ఆ యువకుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో చైతన్యపురిలోని గ్రీన్ హిల్స్ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, అమెరికాలో తరచూ జరిగే కాల్పుల్లో భారత్ యువకులు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది.
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం .. హైదరాబాదీ యువకుడు మృతి
RELATED ARTICLES