Wednesday, May 21, 2025
Homeజాతీయంఛత్తీస్ గఢ్ లో మరో భారీ ఎన్ కౌంటర్…  28 మంది మావోయిస్టుల మృతి..

ఛత్తీస్ గఢ్ లో మరో భారీ ఎన్ కౌంటర్…  28 మంది మావోయిస్టుల మృతి..

మావో అగ్రనేత నంబాల కేశవరావు మృతి చెందినట్టు సమాచారం
ఇంకా కొనసాగుతున్న ఎదురుకాల్పులు

చత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లా అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. బుధవారం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి..ఈ కాల్పుల్లో 28 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు పేర్కొంటున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక జవాన్ మృతి చెందగా.. ఇద్దరికి గాయాలయ్యాయి. అబూజ్‌మడ్ అటవీ ప్రాంతంలో మూడు జిల్లాల భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.. ఉదయం నుంచి DRG జవాన్లకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు ప్రధాన కార్యదర్శి, అగ్ర నేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందినట్లు సమాచారం.. అంతేకాకుండా పలువురు కీలక నేతలు ఉన్నట్లు పేర్కొంటున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన నంబాల కేశవరావు అలియాస్‌ బసవరాజు .. వరంగల్ ఆర్ఈసీలో చదివారు. గంగన్న పేరుతో ఏవోబీలో కేశవరావు కీలక పాత్ర పోషించారు. పార్టీ కేంద్ర కమిటీ సెక్రెటరీ ఎన్కౌంటర్‌లో మృతి చెందడం.. మావోయిస్ట్ పార్టీ చరిత్రలోనే అతి భారీ నష్టంగా పేర్కొంటున్నారు.ఈ ఎన్‌కౌంటర్ కు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు