Wednesday, February 5, 2025
Homeఅంతర్జాతీయంట్రంప్ మరో సంచలన ప్రకటన.. గాజాను స్వాధీనం చేసుకుంటామన్న అమెరికా అధ్యక్షుడు

ట్రంప్ మరో సంచలన ప్రకటన.. గాజాను స్వాధీనం చేసుకుంటామన్న అమెరికా అధ్యక్షుడు

అమెరికా అధ్యక్ష పీఠాన్నిఅధిష్ఠించినప్పటి నుంచి సంచలన నిర్ణయాలు, ప్రకటనలతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన ప్రకటన మరోమారు దుమారం రేపింది. ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో నలిగిపోయిన గాజాను స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నట్టు ట్రంప్ చెప్పారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో భేటీ అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు.

గాజాను స్వాధీనం చేసుకున్న తర్వాత అక్కడ ధ్వంసమైన భవనాలను పునర్నిర్మిస్తామని ట్రంప్ తెలిపారు. ఆ ప్రాంతాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేస్తే అక్కడి ప్రజలకు అపరిమితమైన ఉద్యోగాలు కల్పించవచ్చని పేర్కొన్నారు. ట్రంప్ ప్రకటనపై నెతన్యాహు స్పందించారు. ఈ నిర్ణయం చరిత్రను మారుస్తుందని కొనియాడారు.

కాగా, యుద్ధం కారణంగా గాజాలో నిరాశ్రయులుగా మారిన పాలస్తీనా ప్రజలకు అరబ్ దేశాలు ఆశ్రయం కల్పించాలన్న ట్రంప్ ప్రతిపాదనను ఆయా దేశాలు ఖండించాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. గాజాను తామే స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేస్తామని తెలిపారు. అయితే, ట్రంప్ ప్రకటనను హమాస్ ఖండించింది. ఈ ప్రాంతంలో గందరగోళం, ఉద్రిక్తతలు పెంచేందుకే ట్రంప్ ఈ ప్రకటన చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దురాక్రమణను అడ్డుకుంటామని తెలిపింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు