Homeఅంతర్జాతీయంట్రంప్‌నకు మరో ఎదురుదెబ్బ

ట్రంప్‌నకు మరో ఎదురుదెబ్బ

- Advertisement -


అక్రమ వలసదారులను తరలించడాన్ని ఫెడరల్‌ కోర్టు తప్పుబట్టింది

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అక్రమ వలసదారులను ఇతర దేశాలకు తరలించడాన్ని అక్కడి ఫెడరల్‌ కోర్టు తప్పుబట్టింది. ట్రంప్‌ కార్యవర్గం నిర్ణయాన్ని తాత్కాలికంగా సస్పెండ్‌ చేస్తూ మసాచుసెట్స్‌లోని యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జి బ్రియాన్‌ మర్ఫీ ఈ మేరకు తీర్పునిచ్చారు. అధికారం చేపట్టినప్పటి నుంచి అక్రమ వలసదారులపై ట్రంప్‌ కొరడా ఝుళిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వలసదారులను యూఎస్‌ నుంచి గ్వాటమాల, దక్షిణ సూడాన్‌, కోస్టారికా వంటి ఇతర దేశాలకు తరలించారు. తరలింపు ఎదుర్కొంటున్న వలసదారులు దీనిపై కోర్టులో దావా వేయగా, తాజాగా న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సరైన భద్రతా చర్యలు తీసుకోకుండా.. అక్రమ వలసదారులకు ముందస్తు నోటీసులు, తగిన సమయం ఇవ్వకుండా వారికి సంబంధం లేని వేరే దేశాలకు తరలించడం చట్టవిరుద్ధమని తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసుకునేందుకు ట్రంప్‌ యంత్రాంగానికి 15 రోజుల పాటు సమయం ఇచ్చింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు