ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకి అనుమతి లేదు..
విశాలాంధ్ర – జెఎన్టియు ఏ: ఏపీ ఈసెట్ పరీక్ష మే 6న నిర్వహిస్తున్నట్లు చైర్మన్, జేఎన్టీయూ వీసీ ఆచార్య హెచ్ సుదర్శన్ రావు పేర్కొన్నారు. మంగళవారం జేఎన్టీయూ ఆర్యభట్టు ఆడిటోరియంలో ఏపీ ఈసెట్ పరీక్ష వీసీ, రిజిస్ట్రార్ ఆచార్య ఎస్ కృష్ణయ్య , కన్వీనర్ బి. దుర్గాప్రసాద్ పై పాత్రికేయ సమావేశం నిర్వహించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ.. ఏపీ ఈసెట్ పరీక్షకు అర్హుత సాధించిన విద్యార్థులు బీటెక్ లో రెండో సంవత్సరం ప్రవేశ పరీక్ష చేపట్టడం జరుగుతుందన్నారు. పరీక్షకు మొత్తం 35187 దరఖాస్తులు వచ్చాయని. రెండు సెషన్లలో నిర్వహించడం జరుగుతుందని ఉదయం 9 గంటల నుండి 12:00 వరకు, మధ్యాహ్నం 2 గంటలు నుండి 5 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైన అనుమతి లేదన్నారు. 110 కేంద్రాలలో పరీక్ష చేపట్టడం జరుగుతుందని.. హైదరాబాదులో కూడా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు తమ హాల్ టికెట్ తో పాటు అప్లికేషన్ ఫామ్, గుర్తింపు కార్డును తీసుకుని పరీక్ష కేంద్రానికి ముందస్తుగా చేరుకోవాలని. ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షను రాయాలని విద్యార్థులకు సూచించారు. ఎలక్ట్రానిక్ వస్తువులు పరీక్షా కేంద్రానికి అనుమతి లేదని విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ ఓ ఓం ప్రకాష్ పాల్గొన్నారు.