విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: ఏప్రిల్ 8 న అనంతపురము జిల్లా కేంద్రములోని జిల్లా పరిషత్ హలు లో జరిగే రాష్టస్థాయి ఉద్యాన పంటల సధస్సుకు జిల్లా పండ్లు తోటల రైతు సంఘం అధ్యక్షులు ఆనంత రాముడిని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిరుతల మల్లికార్జున ఆహ్వానించారు. ఈ సందర్భంగా అనంత రాముడు మాట్లాడుతూ .. పండ్ల తోటలో ఎదురవుతున్న సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి, అనుభవాలు, ప్రకృతి వ్యవసాయం, మార్కెటింగ్, నిపుణుల మార్గదర్శకాలు ను విజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు రైతు విజయ శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్న అన్నారు. రైతు సదస్సుకు తన వంతు సహాయ, సహకారాలు అందిస్తానని రైతు సంఘం నాయకులకు బరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎపి రైతు సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు ఎ. కాటమయ్య, రాప్తాడు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి పి. రామకృష్ణ పాల్గొన్నారు.