Thursday, May 8, 2025
Homeజాతీయంఏపీ లిక్కర్ కేసు నిందితులకు సుప్రీంలో చుక్కెదురు

ఏపీ లిక్కర్ కేసు నిందితులకు సుప్రీంలో చుక్కెదురు

అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ నిందితుల పిటిషన్
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు సుప్రీంకోర్టు గురువారం షాక్ ఇచ్చింది. ముందస్తు బెయిల్ కోసం ధనుంజయరెడ్డి, కృష్ణమోహనరెడ్డి, గోవిందప్ప పెట్టుకున్న పిటిషన్ ను కొట్టివేసింది. ఈ కేసులో అరెస్టు నుంచి మినహాయింపు కల్పించాలన్న నిందితుల అభ్యర్థనను తోసిపుచ్చింది. మినహాయింపు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. అనంతరం ఈ కేసు విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది. కాగా, నిందితుల ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఈ నెల 5న సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.ఏపీ లిక్కర్ కేసులో హైకోర్టు విచారణ జరుపుతున్న నేపథ్యంలో బెయిల్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని పేర్కొంది. ఈ నెల 7న హైకోర్టు విచారణ జరిగిన తర్వాతే నిందితుల బెయిల్ పిటిషన్ పై నిర్ణయం తీసుకుంటామని చెబుతూ విచారణను వాయిదా వేసింది. గురువారం ఉదయం ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు.. నిందితులకు ముందస్తు బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు