Saturday, March 1, 2025
Homeజిల్లాలునెల్లూరుఉపాధిహామీ పనులను సందర్శించిన ఏపీఢీ బాబూ రావు

ఉపాధిహామీ పనులను సందర్శించిన ఏపీఢీ బాబూ రావు

విశాలాంధ్ర -వలేటివారిపాలెం : మండలంలోని పోకూరు, నూకవరం, కొండసముద్రం గ్రామాలలో జరుగుతున్న జాతీయగ్రామీణ ఉపాధిహామీ పనులను కందుకూరు ఏపీఢీ బాబూరావు శనివారం సందర్శించారు. ఈ సందర్బంగా కూలీలకు సరాసరి వేతనం 300రూపాయలు కూలి వచ్చేవిధంగా కొలతలపై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఏపీఢీ మాట్లాడుతూ రైతులకు రైతు వారీ కుంటలు ప్రతి గ్రామంలో 25 కు తగ్గకుండా పనులు చేపట్టాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో టీఏలు అశోక్, నాగార్జున, పీల్డ్ అసిస్టెంట్ సుబ్బానాయుడు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు