ప్రిన్సిపాల్ ఏ.చంద్రకళ
విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని పొట్లమర్రి గ్రామంలో గల కస్తూరిబా బాలికల విద్యాలయంలో (కేజీబీవీ) 2026-27 విద్యా సంవత్సరం గాను ఆరవ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరమునకు, అదేవిధంగా ఏడవ, ఎనిమిదవ, తొమ్మిదవ, పదవ, సెకండ్ ఇయర్ ఇంటర్ లో మిగిలి ఉన్న సీట్లకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని ప్రిన్సిపాల్ ఏ. చంద్రకళ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ మార్చి 12వ తేదీ నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించబడునని తెలిపారు. ఇంటర్మీడియట్లో సిఇసి గ్రూపు కలదని, తల్లిదండ్రులు లేని పిల్లలు, ఎస్సీ, ఎస్టి, బీసీ, మైనారిటీ, వికలాంగులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మైనారిటీ విద్యార్థులు ఎక్కువగా దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా కలదని తెలిపారు. విద్యార్థి, తల్లిదండ్రుల ఆధార్, ఫోన్ నెంబర్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, కుల ధ్రువీకరణ పత్రము, రేషన్ కార్డు తో అప్లై చేసుకోవాలని తెలిపారు. మా పాఠశాలలో మంచి వసతి భోజన సదుపాయం అత్యాధునిక డిజిటల్ బోధన ఇంగ్లీష్ మీడియం నందు ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు పాఠశాల యందు నేరుగా సంప్రదించవచ్చునని తెలిపారు.
కస్తూరిబా బాలికల విద్యాలయంలో తరగతుల ప్రవేశాల కొరకు దరఖాస్తు చేసుకోండి..
- Advertisement -
RELATED ARTICLES


