విశాలాంధ్ర – నెల్లిమర్ల : నెల్లిమర్ల మండలం, నగర పంచాయతీల్లో ప్రభుత్వ స్థలాల్లో ఇళ్ళు నిర్మించుకున్న వారు క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకోవాలని తహసీల్దార్ పి సుదర్శనరావు పిలుపునిచ్చారు. స్థానిక కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2019 అక్టోబర్ 15వ తేదీకి ముందు ఎటువంటి అభ్యంతరాలు లేని ప్రభుత్వ స్థలాల్లో ఇళ్ళు నిర్మించుకున్న వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అటువంటి వారు వార్డు, గ్రామ సచివాలయాల్లోనూ, మీసేవ కేంద్రాల్లోనూ దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తులను పరిశీలించి, విచారణ చేపట్టిన తర్వాత క్రమబద్ధీకరణ చేపడతామని తహసీల్దార్ పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వం జీఓ నంబర్ 30 జారీచేసిందని తహసీల్దార్ చెప్పారు.