విశాలాంధ్ర ధర్మవరం:: డివిజన్ పరిధిలోని ఏడు మండలాలలో భూముల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోవాలని ఆర్డీవో మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీసేవ, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తుల స్వీకరణ జరుగుతోందని తెలిపారు. వేగంగా ప్రామాణికమైన విధానాన్ని అందుబాటులోకి తెచ్చే విధంగా రెవెన్యూ యంత్రాంగం కృషి చేస్తుందని తెలిపారు. డివిజన్ పరిధిలో అభ్యంతరము లేని ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణకు సంబంధించి మరో కీలకంగా ముందడుగు వేయడం జరిగిందని తెలిపారు. దీనివల్ల నిరుపేదలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా సులభంగా క్రమబద్ధీకరణ చేసుకునేందుకు ఒక మంచి అవకాశం రావడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ జీవో నెంబర్ 30ను అనుసరించి ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ 2025 పేరిట భూముల క్రమ భద్రీకరణ చేపడతామని తెలిపారు. డిసెంబర్ 31 వరకు ఈ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. క్రమబద్దీకరణ పట్టాలను మహిళల పేరిట మాత్రమే పంపిణీ చేస్తామని తెలిపారు. తమ పూర్తి వివరాలను నిర్దేశించిన ధ్రువీకరణ పత్రాలతో మీ సేవ ద్వారా అప్లోడ్ చేయవలసి ఉంటుందని తెలిపారు. 2019 అక్టోబర్ 15 ప్రామాణిక తేదీగా తీసుకొని ఆ తేదీ కంటే ముందు ఆక్రమణలలో ఉన్న భూములను నిబంధనలు అనుసరించి క్రమబద్దీకరిస్తామని తెలిపారు. అంతేకాకుండా అత్యంత వేగంగా ప్రమాణమైన దరఖాస్తు విధానాన్ని మీసేవ ద్వారా అందుబాటులోకి తేవడం జరిగిందని తెలిపారు. దారిద్య రేఖకు దిగువన ఉండి 151 నుండి 300 గజాలలోపు అక్రమణులకు బేసిక్ ధరలో 15 శాతము రిజిస్ట్రేషన్ ఫీజులో 50 శాతము చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఇదే విభాగంలో దారిద్రేకకు ఎగువన ఉన్నవారు 200 శాతం బేసిక్ ధర పూర్తి రిజిస్ట్రేషన్ ఫీజు కట్టవలసి ఉంటుందని తెలిపారు. 450 గజాలకు మించిన ఆక్రమణలో ఎవరు ఉన్నప్పటికీ బేసిక్ ధరకు ఐదురెట్లు 100 శాతము రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి క్రమబద్ధీకరించుకోవలసి ఉంటుందని తెలిపారు. అర్హుల జాబితా ఖరారు అయిన తర్వాత ఆ వివరాలను తహసిల్దార్లు కార్యాలయం, సబ్ రిజిస్టార్ లో కార్యాలయాల వద్ద పంపడం జరుగుతుందన్నారు.
భూముల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోండి.. ఆర్డీవో మహేష్
RELATED ARTICLES