7,200 స్పెషల్ బస్సులు నడపనున్న ఏపీఎస్ఆర్టీసీ
ప్రత్యేక బస్సుల్లో ఎలాంటి అదనపు చార్జీలు ఉండవని వెల్లడి
అడ్వాన్స్ బుకింగ్ సౌకర్యం ఉంటుందని వివరణ
సంక్రాంతి పండగ వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) ప్రయాణికులకు తీపి కబురు చెప్పింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న ఏపీ ప్రజలు.. సంక్రాంతి పండగసందర్భంగా స్వగ్రామాలకు వచ్చేందుకు ఏకంగా 7,200 అదనపు బస్సులు ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. తెలంగాణ, ఇతర పొరుగు రాష్ట్రాలకు పెద్ద సంఖ్యలో స్పెషల్ బస్సులు నడపనున్నారు. సంక్రాంతి స్పెషల్ బస్సులు జనవరి 8 నుంచి 13వ తేదీవరకు అందుబాటులో ఉంటాయని ఏపీఎస్ఆర్టీసీ వెల్లడించింది. హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు 2,153 బస్సులు, బెంగళూరు నుంచి ఇతర ప్రాంతాలకు 375 బస్సులు, విజయవాడ నుంచి 300 అదనపు బస్సులు నడపనున్నారు. ఇక తిరుగు ప్రయాణానికి ఈ నెల 16 నుంచి 20 వరకు 3,200 ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ప్రత్యేక బస్సుల్లో ఎలాంటి అదనపు చార్జీలు ఉండవని ఆర్టీసీ స్పష్టం చేసింది. ఒకేసారి రానుపోను టికెట్ బుక్ చేసుకుంటే 10 శాతం రాయితీ లభిస్తుందని వెల్లడించింది. ఈ స్పెషల్ బస్సుల్లో ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకునే సౌకర్యం ఉంటుందని తెలిపింది.
సంక్రాంతికి స్పెషల్ బస్సుల సంఖ్యను మరింత పెంచిన ఏపీఎస్ఆర్టీసీ
RELATED ARTICLES