సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్
విశాలాంధ్ర ధర్మవరం; ధర్మవరం పట్టణం లో మారుతీ నగర్,రాజేంద్ర నగర్, లో గల పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు
ఇవ్వాలని ,ఇంటి ఇంటి కి వెళ్లి ఇల్లు లేని పేద వారిని గుర్తించి వారితో దరఖాస్తులను రాయడం జరిగింది అని సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం హయాంలో పేదలకు గ్రామాల్లో ఇచ్చిన ఒకటిన్నర సెంట్లు, గాను మూడు సెంట్లుగా, పట్టణాల్లో 1 సెంటు, గాను రెండు సెంట్లుగా చొప్పున ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలన్నారు. అలాగే పేద ప్రజల కి ప్రభుత్వమే పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలి. అలాగే 10 సంవత్సరాలు నివాసముంటున్న ఇండ్లకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా పేద ప్రజలకు ఇంటి పట్టాలు ఇవ్వాలని దరఖాస్తులు పూర్తి చేసి మార్చి 3,తేదీన పుట్టపర్తి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఇల్లు లేని నిరుపేదలు నివేశ స్థలాల కోసం దరఖాస్తులు తీసుకొని జిల్లాకలెక్టర్ ఆఫీస్ కి రావాలని పిలుపునిచ్చారు . ఈ ప్రభుత్వాలు ఎన్ని మారిన కూడా పేదవారి జీవితాలు మాత్రం మారడం లేదు.ఇంకా ఎంతో మంది నిరుపేదలు ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నారు.అర్హత కలిగిన ప్రతి ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు పేదల పక్షాన భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది. పేదల కు ఎప్పుడు అండగా ఉంటుంది అని ఈ సందర్బంగా ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఐసహాయ కార్యదర్శి ఎర్రంశెట్టి రమణ, చేనేత కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు,గుర్రం వెంకటస్వామి,మహిళా సమాఖ్య నాయకురాలు లలితమ్మ, లింగమ్మ, ఈరమ్మ, పట్టణ నాయకులు జింక కేశవ దితరులు పాల్గొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు స్థలాలు ఇవ్వాలి
RELATED ARTICLES