విశాలాంధ్ర ధర్మవరం:; ధర్మవరం పట్టణానికి చెందిన శంకర్ రాజ్ కుమార్ (34) ఆర్మీలో మేజర్గా విధులు నిర్వర్తిస్తూ మృతి చెందాడు. ఈ సందర్భంగా మృతదేహాన్ని ఆర్మీ నుంచి ధర్మారానికి తీసుకొని వచ్చారు. సైనిక్ ఎలాంచనాలతో అంత్యక్రియలను పూర్తి చేశారు. మేజర్ శంకర్ రాజ్ కుమార్ ఆర్మీలోని వైద్య విభాగంలో డాక్టర్ గా లక్నోలో విధులు నిర్వర్తించే వారిని, భార్య ప్రసన్న కూతురు సన్విత హైదరాబాదులోని మణికొండ వద్ద అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. ఈనెల రెండవ తేదీన లక్నో నుంచి హైదరాబాద్కు చేరుకున్న మృతుడు తన అపార్ట్మెంట్లోని ఐదవ అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్యాయత్నం చేశారు. గమనించిన స్థానికులు సిమ్స్ హాస్పిటల్ కు చేర్చారు. అనంతరం చికిత్స పొందుతూ మృతి చెందారు. ధర్మవరంలోని స్మశాన వాటికలో ఆర్మీ అధికారుల ఆధ్వర్యంలో సైనిక లాంచనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి, బిజెపి ఇన్చార్జ్ హరీష్ బాబు తదితరులు స్మశాన వాటికకు చేరుకొని మేజర్కు ఘన నివాళులు అర్పించారు.
ఆర్మీ మేజర్ కు సైనిక లాంచనాలతో అంత్యక్రియలు
RELATED ARTICLES