హాకీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షులు, జిల్లా జనరల్ సెక్రెటరీ బి. సూర్యప్రకాష్
విశాలాంధ్ర ధర్మవరం;; రాష్ట్రస్థాయి హాకీ పోటీల నిర్వహణకు ఏర్పాట్లు అన్ని పూర్తి చేయడం జరిగిందని హాకీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షులు హాకీ శ్రీ సత్యసాయి జిల్లా జనరల్ సెక్రెటరీ బి.సూర్యప్రకాష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఏప్రిల్ 6 నుంచి 9 వతేదీ జరగనున్న 15వ రాష్ట్ర స్థాయి జూనియర్ బాలుర ఛాంపియన్ షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.దివంగత వ్యాయామ ఉపాధ్యాయులు ఊకా అశ్వర్త నారాయణ జ్ఞాపకార్థం ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. గతంలో అశ్వర్త నారాయణ శిక్షణలో చాలామంది క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదిగారన్నారు. ఈ టోర్నమెంట్ ను హాకీ ఆంధ్ర ప్రదేశ్ సౌజన్యంతో, హాకీ శ్రీ సత్య సాయి జిల్లా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హాకీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షులు సూర్య ప్రకాష్ మాట్లాడుతూ పోటీ లకు వివిధ జిల్లాల నుంచి 22 జట్లు పాల్గొంటాయన్నారు.
ఇక్కడ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్టుకు ఎంపిక చేస్తారని
వెల్లడించారు. క్రీడాకారులకు భోజన, వసతి, ఇతర సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని ఆసక్తి గల హాకీ క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
రాష్ట్ర స్థాయి హాకీ పోటీల నిర్వహణకు ఏర్పాట్లు..
RELATED ARTICLES