Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఇండిపెండెంట్ డే వేడుకల నిర్వహణ ఏర్పాట్లు వేగవంతం- జిల్లా కలెక్టర్ టి.ఎస్.చేతన్

ఇండిపెండెంట్ డే వేడుకల నిర్వహణ ఏర్పాట్లు వేగవంతం- జిల్లా కలెక్టర్ టి.ఎస్.చేతన్

- Advertisement -

విశాలాంధ్ర పుట్టపర్తి:- ఇండిపెండెంట్ డే వేడుకల నిర్వహణ ఏర్పాట్లను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ టి.ఎస్.చేతన్ అధికారులను ఆదేశించారు. గురువారం ఈ నెల 15 న జరుగనున్న 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను ఎస్పీ రత్న, జేసి అభిషేక్ కుమార్..లతో కలసి జిల్లా కలెక్టర్ టి.ఎస్.చేతన్ పరిశీలించారు.ఈ సందర్భంగా మైదానంలో జరుగుతున్న పనుల గురించి కలెక్టర్ ఆరా తీశారు. వేదిక, డెకరేషన్, పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్, సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రజలకు తెలియజేసే విధంగా వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా శకటాల ప్రదర్శన, స్టాల్స్ ఏర్పాట్లు తదితర అంశాలపై అధికారులకు కలెక్టర్ తగు సూచనలు జారీ చేశారు.
శుక్రవారం 15వ తేది ఉదయం 9 గంటలకు రాష్ట్ర బిసి, సంక్షేమ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత పాల్గొని జాతీయ పతాకావిష్కరణ గావిస్తారని తెలిపారు. ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.ప్రజా ప్రతినిధులు, జిల్లా ప్రజలు, విద్యార్థులు, స్వాతంత్ర్య సమరయోధులు హాజరుకానున్న ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో సువర్ణ, డిఇఓ కృష్ణయ్య, సమగ్ర శిక్ష పీడి దేవరాజ్, అన్ని శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు