Monday, May 5, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిశ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాల పునఃప్రారంభానికి ఏర్పాట్లు

శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాల పునఃప్రారంభానికి ఏర్పాట్లు

విశాలాంధ్ర -ధర్మవరం; పట్టణంలోని 8వ వార్డులో(చెలిమి) దగ్గర గత కొంతకాలంగా నిరుపయోగంగా ఉన్న శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాల తిరిగి విద్యార్థుల కిలకిలలతో నిండే దిశగా అడుగులు వేస్తోంది. ఈ పాఠశాల స్థితిగతుల గురించి తెలుసుకున్న రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, తక్షణమే స్పందిస్తూ పాఠశాల పునఃప్రారంభానికి అవసరమైన చర్యలను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల భవనం యొక్క మరమ్మతులు, శుభ్రతా పనులు, గోడల రంగులు, విద్యుత్ మరియు నీటి సదుపాయాలు, టాయిలెట్లు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు ప్రస్తుతం వేగంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంత్రి నియోజకవర్గ ఇంచార్జ్ హరీష్ బాబు స్వయంగా పాఠశాలను సందర్శించి, జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా హరీష్ బాబు మాట్లాడుతూ, గతంలో నిర్లక్ష్యానికి గురైన ఈ పాఠశాలపై మంత్రి ప్రత్యేక దృష్టి వహించడం వల్లే ఈ పునరుద్ధరణ సాధ్యమవుతోంది అని తెలిపారు. త్వరలోనే పిల్లల విద్యకు ఇది కేంద్రబిందువుగా మారనుంది అని అన్నారు. ఒకప్పుడు సరస్వతీ శిశు మందిరంలో విద్య విషయంలో ఎంతో మంచి గుర్తింపు ఉండేదని తెలిపారు. పదవ తరగతి పరీక్ష ఫలితాలలో కూడా మంచి ప్రతిభను కూడా కనపరచడం జరిగిందన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు