Monday, April 7, 2025
Homeఆంధ్రప్రదేశ్23న సిపిఐ బహిరంగ సభకు చేతివృత్తిదారులు పెద్ద ఎత్తున తరలిరండి

23న సిపిఐ బహిరంగ సభకు చేతివృత్తిదారులు పెద్ద ఎత్తున తరలిరండి

ఏపీ చేతివృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు సి. లింగమయ్య పిలుపు

విశాలాంధ్ర -అనంతపురం : 23న సిపిఐ బహిరంగ సభకు చేతివృత్తిదారులు పెద్ద ఎత్తున తరలి రావాలని ఏపీ చేతి వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు సి. లింగమయ్య పిలుపునిచ్చారు. రాష్ట్ర చేతివృత్తిదారుల సమాఖ్య స్థానిక సి పి ఐ ప్రధాన కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సి. లింగమయ్య మాట్లాడుతూ… సిపిఐ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే కె రామకృష్ణ పాల్గొంటారన్నారు. ఆదివారం 23వ తారీకు సాయంత్రం అనంతపురంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం ముందు జరిగే బహిరంగ సభకు చేతి వృత్తిదారులందరూ తరలిరావాలన్నారు. బిజెపి నరేంద్ర మోడీ దుష్ట పరిపాలనకు వ్యతిరేకంగా రాజ్యాంగ పరిరక్షణ కోసం భారతదేశ వ్యాప్తంగా మార్చి 23 సర్దార్ భగత్ సింగ్ వర్ధంతి పురస్కరించుకుని ఏప్రిల్ 14 బిఆర్ అంబేద్కర్ జయంతి వరకు ప్రచార కార్యక్రమానికి సిపిఐ జాతీయ సమితి పిలుపు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ చేతి వృత్తిదారుల సమాఖ్య జిల్లా కార్యదర్శి సి.వి హరికృష్ణ రజక వృత్తిదారుల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు సి నాగప్ప, గీత పనివాళ్ల సంఘం జిల్లా కార్యదర్శి రఘు, జిల్లా నాయకులు నాగరాజు, నాయి బ్రాహ్మణ వృత్తిదారుల సమాఖ్య నగర అధ్యక్షులు గోవిందరాజులు, చేతి వృత్తిదారుల సమాఖ్య నగర అధ్యక్షులు టిసి భూషణ గౌరవాధ్యక్షులు ఈశ్వరమ్మ, గొర్రెలు మేకల పెంపకదారుల సంఘం నగర నాయకులు సి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు