Wednesday, January 22, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిడిఎస్పీగా బి. హేమంత్ కుమార్ పదవీ బాధ్యతలు స్వీకరణ

డిఎస్పీగా బి. హేమంత్ కుమార్ పదవీ బాధ్యతలు స్వీకరణ

విశాలాంధ్ర ధర్మవరం:: ధర్మవరం నూతన డిఎస్పీగా బి. హేమంత్ కుమార్ బుధవారం ఉదయం స్వీకరించారు. వీరు విజయనగరం గ్రేహౌండ్స్ లో ప్రొహిబిసర్ -డీఎస్పీగా విధులు కొనసాగిస్తూ ధర్మవరంకు పదోన్నతి పై డిఎస్పీగా బదిలీ అయ్యా రు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో డిఎస్పి ట్రైనర్గా అక్కడ విధులు కొనసాగించారు. ప్రస్తుతమున్న డి.ఎస్.పి శ్రీనివాసులు మంగళగిరి హెడ్ క్వార్టర్స్ కి రిపోర్టు చేసుకోమని జిల్లా ఉన్నతాధికారులు ఆదేశించడం జరిగింది. ప్రస్తుత డి.ఎస్.పి శ్రీనివాసులు నూతన డిఎస్పి అయిన బి.హేమంత్ కుమార్ కి పదవీ బాధ్యతలను అప్పగించారు. తదుపరి డిఎస్పీ కార్యాలయాన్ని వారు పరిశీలించారు. అదేవిధంగా ప్రస్తుతం పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను సంబంధిత సిబ్బంది ద్వారా అడిగి తెలుసుకున్నారు. తదుపరి డిఎస్పి కార్యాలయ సిబ్బంది నూతన డిఎస్పీకి పదవీ బాధ్యతల స్వీకరణ సందర్భంగా బొకే తోపాటు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ధర్మవరం డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్లో ప్రజలందరికీ తగిన న్యాయం చేకూర్చే విధంగా తాను నిరంతరం కృషి చేస్తారని తెలిపారు. డివిజన్లోని ప్రజలందరూ కూడా తమ సమస్యలు ఏమైనా ఉన్న యెడల నేరుగా ఆ మండల పోలీస్ స్టేషన్కు వెళ్లి పరిష్కరించుకునే అవకాశం ఉందని తెలిపారు. ఏ పోలీస్ స్టేషన్లోనైనా తమకు న్యాయం జరగాని ఎడల నా వద్దకు రావచ్చునని తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సి ఐ లు గాని ఎస్సైలు గాని సిబ్బంది గాని స్టేషన్కు వచ్చే ప్రజలకు గౌరవం, మర్యాదతో పలకరించాలని తెలిపారు. ఎక్కడ కూడా ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటానని తెలిపారు. ముఖ్యంగా ఫ్యాక్షన్ గ్రామాలలో ప్రత్యేక నిగా ఉంచుతామని తెలిపారు. తదుపరి మట్కా, జూదం, బాల్య వివాహాలు, స్పందన కార్యక్రమం, నైట్ బీట్, గ్రామాలలో నిద్ర తదితర కార్యక్రమాలను పక్కా నిర్వహించే విధంగా తాను చర్యలు చేపడతానని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు