విశాలాంధ్ర ధర్మవరం : నియోజకవర్గంలోని ముదిగుబ్బ మండలంలోని జరుగుతాండ గుడంపల్లి తాండ గ్రామాలలో నాటు సారా పై దాడులు నిర్వహించడం జరిగిందని ఎక్సైజ్ సీఐ చంద్రమణి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ దాడులలో గుడ్డంపల్లి తండాలో ఎం. రవి నాయక్ అనే వ్యక్తి దగ్గర 10 లీటర్ల నాటు సారాయి, 135 లీటర్ల పులియబెట్టిన వాష్ దొరికిందని తెలిపారు. తదుపరి మేఘావత్ వెంకటేష్ నాయక్ అనే వ్యక్తి దగ్గర 10 లీటర్ల నాటు సారాయి, ఒక బ్లాక్ పుల్సార్ బైక్ సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. వీరి ఇరువురును కోర్టు ఎదుట హాజరు పరచగా రిమాండ్కు పంపడం జరిగిందని తెలిపారు. అలాగే ఐదు మందిని ఇన్వాల్వ్ చేసి కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. అలాగే పాత కేసులలోని రన్వే ముద్దాయిలను తులసి నాయక్ చంద్ర నాయక్ శంకర్ నాయకులను కూడా అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజరపరిచి రిమాండ్కు పంపడం జరిగిందన్నారు. అనంతరం గ్రామాలలో ప్రజలకు నాటు సారా పై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. నాటు సారా తయారు చేయుట అమ్ముట చట్టరీత్యా నేరము అని తెలపడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి ఎక్సైజ్ చూపెట్టండి నరసింహులు అనంతపురం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ సూపర్డెంట్ శ్రీరామ్, పుట్టపర్తి, సికేపల్లి,పుట్టపర్తి , ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లు,ఇన్స్పెక్టర్ చాంద్ భాషా, నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.
నాటు సారా పై దాడులు.. ఎక్సైజ్ చంద్రమణి
RELATED ARTICLES