విశాలాంధ్ర-రాజాం (. విజయనగరం జిల్లా) : పాక్ లోని ఉగ్ర స్థావరాలపై భారత్ దాడులు చేయడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పహల్గామ్ టెర్రర్ అటాక్ కు ఇండియన్ ఆర్మీ బుధవారం తెల్లవారుజామున ప్రతీకారం తీర్చుకోవడంపై విజయనగరం జిల్లా రాజాం మాజీ సైనిక ఉద్యోగులు, ప్రజలు, పిల్లలు ఆనందం వ్యక్తం పరిచారు. ఆదర్శనగర్ లో మాజీ సైనిక్ ఉద్యోగులు సుబేదార్ తవ్వా.నాగరాజు ఆధ్వర్యంలో కొత్తకోట.గోవిందరావు, బొడ్డు.అప్పలరాజు, ఏ.అనంతరావు నమ్మిశెట్టి సురేష్, శంకర్రావు లు పిల్లలకు మిఠాయిలు పంచి ఆనందం వ్యక్తపరిచారు. అలాగే రాజాం నరసింహనాయుడు కాలనీలో యువత, చిన్నారులు ‘భారత్ మాతా కీ జై’, ‘ఇండియన్ ఆర్మీ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు. టపాసులు కాలుస్తూ, మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు.