Wednesday, April 30, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఈవీఎం గోడౌన్ కు మరింత భద్రత కల్పించేలా అధికారులు చర్యలు గైకొనండి..

ఈవీఎం గోడౌన్ కు మరింత భద్రత కల్పించేలా అధికారులు చర్యలు గైకొనండి..

జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఈవీఎం గోడౌన్ కు మరింత భద్రత కల్పించేలా అధికారులు తగిన చర్యలు గైకొనాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని మార్కెట్ యార్డులో గల ఈవీఎం గోడౌన్ ను ఆకస్మికంగా పరిశీలించారు. అనంతరం గోడౌన్కు శీలు తో వేసిన బీగాన్ని వారు పరిశీలించారు. అనంతరం గోడౌన్ గోడలను కూడా పరిశీలించి అక్కడక్కడ గోడలు చీలిన వాటికి చిన్న చిన్న మరమ్మత్తులు చేయాలని, ఎక్కడ కూడా గోడలకు రంధ్రాలు ఉండరాదని, కిటికీలు, వాకిళ్లకు మరింత భద్రత కల్పించాలని తెలిపారు. వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధుల నడుమ ఈ ఆకస్మిక తనిఖీని నిర్వహించామని వారు తెలిపారు. అదేవిధంగా మార్కెట్ యార్డులో గల స్టాక్ పాయింట్ మార్కెట్ ను కూడా తనిఖీ చేసి, అక్కడ గల స్టాకును పరిశీలించి, సిబ్బందికి తగు సూచనలను తెలియజేశారు.

ఆర్డీవో కార్యాలయంలో రీ సర్వే సమీక్షా సమావేశంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్;; పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో రీ సర్వే శిక్షణ, సమీక్షా సమావేశంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రీ సర్వేలో శిక్షణ ఎలా కొనసాగుతోందని ఆర్డీవో మహేష్ ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ వి సర్వేలో క్షేత్రస్థాయిలో తలెత్తే సమస్యలను చైత్రస్థాయి సిబ్బందికి తప్పక తెలియజేయాలని, తదుపరి ఆ సమస్యలను పరిష్కరించడంలో తీసుకోవలసిన చర్యలపై తప్పక అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. అనంతరం ఆర్డీవో మహేష్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రీ సర్వే ను తీసుకున్నదని విజయవంతంగా చేస్తూ ఎలాంటి తప్పిదాలు లేకుండా నిర్వహించాలని,అందుకే ముందస్తు చర్యగా ఇటువంటి అవగాహన సదస్సు క్షేత్ర సాయి సిబ్బందికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎవో కతి జూన్న్ కుప్రా, స్థానిక ఎమ్మార్వో నటరాజ్, డివిజన్లోని తాసిల్దార్లు, రీ సర్వే డిప్యూటీ తాసిల్దార్లు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే అధికారులు, వీఆర్వోలు, గ్రామ సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు