Homeఆంధ్రప్రదేశ్ఆటో డ్రైవర్ నిజాయితీ..అభినందించిన కడియం సిఐ

ఆటో డ్రైవర్ నిజాయితీ..అభినందించిన కడియం సిఐ

- Advertisement -

విశాలాంధ్ర – కడియం : తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి కి చెందిన సత్తి కృష్ణాసత్యనారాయణ రెడ్డి రాజమండ్రి వైపు వస్తున్న ఆటోలో ఎక్కి, కడియం పోలీస్ స్టేషన్ సమీపంలో దిగే సమయంలో తన మొబైల్ ఫోన్‌ను ఆటోలోనే మర్చిపోయినట్టు కడియం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫోన్ కోసం ఎంక్వయిరీ చేయగా రాజమహేంద్రవరం బొల్లినేని హాస్పిటల్ సమీపంలో గల ఆటో స్టాండ్ కు చెందిన డ్రైవర్ చెక్కరాజు తనకు ఆటోలో దొరికిన ఫోన్ రాజమహేంద్రవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో అందజేసినట్లు తెలిపారు. తనకు దొరికిన ఫోన్‌ను నిజాయితీతో పోలీసులకు అప్పగించిన ఆటో డ్రైవర్ చెక్క రాజు ను కడియం సిఐ అల్లు వెంకటేశ్వరరావు అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు