విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని సిద్దయ్యగుట్ట, సాయి నగర్, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గుడి దగ్గర గల శ్రీ అవధూత తిక్క నారాయణస్వామి 53వ ఆరాధన మహోత్సవ వేడుకలు ఈనెల ఏడవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు అంగరంగ వైభవంగా భక్తాదులు, దాతలు, భజన మండలి ఆధ్వర్యంలో జరిగాయి. మొదటి రోజు అఖండనామ భజన తో 12 భజన మండలి బృందం వారు 24 గంటల పాటు భజనలు నిర్వహించారు. రెండవ రోజున గీతా పారాయణం ను గిర్రప్ప స్వామి శిష్య బృందం చే నిర్వహించడం జరిగిందని భజన మండలి వారు తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా రక్తదాన శిబిరమును కూడా నిర్వహించడం జరిగిందని, ఈ శిబిరాన్ని వన్ టౌన్ సిఐ నాగేంద్రప్రసాద్ ప్రారంభించడం జరిగిందని తెలిపారు. అనంతరం సిఐ మాట్లాడుతూ ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎంతోమందికి స్ఫూర్తిని ఇస్తాయని, మా తరఫున కూడా ఈ భజన మండల వారికి ఎల్లప్పుడూ మా సహాయ సహకారాలను అందిస్తామని తెలిపారు. తదుపరి భజన మండలి వారు మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవ, అన్ని దానముల కన్నా రక్తదానం మిన్న అన్న స్ఫూర్తితో ఈ శిబిరాన్ని నిర్వహించినట్లు వారు తెలిపారు. మొత్తం 52 మంది రక్తదానం చేశారు. తదుపరి భక్తాదులకు అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించామని తెలిపారు. వేడుకలో భాగంగా సాయంత్రం అవధూత తిక్క నారాయణస్వామి చిత్రపటాన్ని గురువుల ద్వారా పట్టణంలోని పలు కూడలిలో ఊరేగింపును కూడా నిర్వహించామని తెలిపారు. ఈ ఆరాధన వేడుకలకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారాలు అందించి విజయవంతం చేసిన వారందరికీ కూడా భజన మండలి వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలను తెలియజేశారు. ప్రతిరోజు పేదలకు ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా ఉచిత సేవలో భాగంగా వైకుంఠ రథం, ఫ్రీజర్ బాక్స్ ,అంబులెన్స్ ను కూడా పేద ప్రజలకు అందించడం మాకెంతో సంతోషాన్ని తృప్తిని ఇచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ చైతన్య భక్త భజన మండలి కళ్యాణ్, నాగరాజు, సత్యమూర్తి ,చలపతి, సంజీవరాయుడు తోపాటు అధిక సంఖ్యలో భక్తాదులు, దాతలు పాల్గొన్నారు.
అవధూత తిక్క నారాయణస్వామి 53వ ఆరాధన మహోత్సవ వేడుకల్లో భాగంగా రక్తదాన శిబిరము
RELATED ARTICLES