Tuesday, December 3, 2024
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిస్కూల్ టీచర్స్ అసోసియేషన్ కు ఎన్నికైన ఉపాధ్యాయులకు సన్మానం

స్కూల్ టీచర్స్ అసోసియేషన్ కు ఎన్నికైన ఉపాధ్యాయులకు సన్మానం

విశాలాంధ్ర -పెనుకొండ (శ్రీ సత్య సాయి జిల్లా) : స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా కాడిశెట్టి శ్రీనివాసులు, ఎన్నికైన సందర్భంగా పెనుకొండ డివిజన్ ఉపాధ్యాయులు ఆయన నివాసంలో కలిసి శుక్రవారం సన్మానించి అభినందనలు తెలియజేశారు.అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన యం.వి.కృష్ణారెడ్డిని సన్మానించారు. పెనుకొండ వాసి రాష్ట్ర అధ్యక్షుడు కావడం సంతోషంగా ఉందని ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర స్థాయిలో కృషి చేయాలని కోరారు. ఉపాధ్యాయుల పదోన్నతులు, గత పిఆర్సీ,డిఎ బకాయిల చెల్లింపు, సిపియస్ రద్ధు వంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారానికి కృషి చేయాలని పిఆర్సీ ఆలస్యమవుతున్నందున ఐఆర్ ప్రకటించేలా ప్రాతినిధ్యం చేయాలని ఉపాధ్యాయులు కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వేణుగోపాల్ రెడ్డి, జి.గోపాల్,అమీర్ వలి,ఆర్.చంద్రశేఖర్, సి.నరేష్ మార్,ఆనంద్,ఇర్ఫాన్,జి.హనుమంతరాయుడు,బాబు,యస్.రవికుమార్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు,

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు