Saturday, April 19, 2025
Homeజిల్లాలుఅనంతపురంబాల్య వివాహాలపై విద్యార్థినిలకు అవగాహన

బాల్య వివాహాలపై విద్యార్థినిలకు అవగాహన

విశాలాంధ్ర-తాడిపత్రి ( అనంతపురం జిల్లా ) : బాల్య వివాహాలతో ఆడవాళ్లకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని వైద్యాధికారి సుమన్ విద్యార్థినిలకు సూచించారు. శనివారము మండల పరిధిలోని నందలపాడు వద్ద ఉన్న ఏపీ మోడల్ స్కూల్, పుట్లూరు రోడ్డు రెడ్డి కాలనీ వద్ద ఉన్న కేజీవీబీ స్కూళ్లలో వైద్య ఆరోగ్యశాఖ, విద్యాశాఖ ఆధ్వర్యంలో బాల్య వివాహాల, టీనేజి ప్రెగ్నెన్సీలపై పాఠశాల విద్యార్థినిలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వైద్యాధికారి డాక్టర్. సుమన్ మాట్లాడుతూ బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాల గూర్చి వివరించారు. అలాగే మగవారు 21 సంవత్సరాలు ఆడవారు 19 సంవత్సరాలు పూర్తి కాకుండా పెళ్ళిళ్ళు చేసుకోరాదని విద్యార్థినిలకు తెలియజెప్పారు. అనంతరం ఆరోగ్య విద్యా బోధకుడు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ బాలికలు 19 సంవత్సరాలు పూర్తి కాకుండా గర్భం దాల్చడం తల్లికి, పుట్టబోయే శిశువుకు అనారోగ్య సమస్యలు ఉంటాయన్నారు. రాబోవు రోజుల్లో ఆడపిల్లలకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని విద్యార్థినిలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ ప్రిన్సిపల్, పీహెచ్ఎన్ నాగరత్నమ్మ హెల్త్ అసిస్టెంట్ కిరణ్ కుమార్ ఆరోగ్య, ఉపాద్యాయ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు