కరస్పాండెంట్ నిర్మల జయచంద్ర రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని కాకతీయ విద్యా నికేతన్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రత ట్రాఫిక్ నియమాలపై అవగాహన కోసం దృశ్యాత్మక కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని పాఠశాల కరస్పాండెంట్ నిర్మల జయచంద్ర రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ రోడ్డుపై నడిచేటప్పుడు, వాహనాలు నడిపేటప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించడం వలన జరిగే ప్రమాదాలు గూర్చి హెల్మెట్ వాడకం వలన జరగబోయే ప్రమాదాలను ఎలా అరికట్టవచ్చో విద్యార్థులకు వివరించడం జరిగిందని తెలిపారు. తదుపరి రోడ్డు భద్రత ట్రాఫిక్ నియమాల గూర్చి దృశ్యాత్మకంగా చూపించడం జరిగిందని తెలిపారు. తద్వారా విద్యార్థులలో పూర్తి అవగాహన వస్తుందని వారు తెలిపారు. అదేవిధంగా ట్రాఫిక్ నియమాలకు సంబంధించిన గుర్తులు గూర్చి వివరించడం జరిగిందన్నారు. వాహనాలు వేగంగా నడపడం వలన జరిగే ప్రమాదాల గురించి, ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి కూడా విద్యార్థులకు కళ్లకు కట్టినట్లు చూపించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు సూర్య ప్రకాష్ రెడ్డి, పద్మ, ఉపాధ్యాయ, బోధనేతర బృందం, పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
రోడ్డు భద్రత ట్రాఫిక్ నియమాలపై అవగాహన సదస్సు..
RELATED ARTICLES