విశాలాంధ్ర ధర్మవరం;; పేటా ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ హర్షవర్ధన్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ జంతువులు, పక్షుల పట్ల ప్రస్తుత సమాజం మెలుగుతున్న విధానం మరియు వాటి సంరక్షణ కోసమై పెటా సంస్థ అంతర్జాతీయంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. మనుష్యులతో పాటుగా ఈ ప్రకృతిలో ఉండే ప్రతి జీవికి బ్రతికే హక్కు ఉన్నదని అవి జంతువులైనా లేక పక్షులైనా వాటిని సంరక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుందని వారు తెలిపారు. ఎక్కడైనా అనాథ జంతువులు కనబడితే వాటిని సంరక్షించే సంస్థలు ఎన్నో ఉన్నాయని, మనం గమనించి వారికి తెలియపరిస్తే చాలు అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెటా సంస్థ కోఆర్డినేటర్లు, కళాశాల ఇన్చార్జి రమేష్, అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
పెటా ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం.. ప్రిన్సిపాల్ హర్షవర్ధన్
RELATED ARTICLES