Homeజిల్లాలుఅనంతపురంప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ….

ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ….

- Advertisement -

అనంతపురం జిల్లా: విశాలాంధ్ర – నార్పల :- మండల కేంద్రంలోని ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశా కార్యకర్తలు, పాఠశాల విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించి కుటుంబ సంక్షేమం, తల్లిఉశిశు ఆరోగ్య పరిరక్షణ, మహిళల సాధికారత, జనాభా నియంత్రణ, స్థిరమైన అభివృద్ధిపై నినాదాలతో ప్రజలను చైతన్యపరిచారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో డా. ఎ. యమీమా భూషణ్ మాట్లాడుతూ, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కుటుంబ సంక్షేమ సేవలను సద్వినియోగం చేసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. పీహెచ్‌ఎన్ జైతూన్ బీ, సీహెచ్‌ఓలు కర్నూలు భార్గవి, సాయిసుధ, హెల్త్ అసిస్టెంట్లు రాయుడు, మునిరెడ్డి మాట్లాడుతూ తల్లిఉశిశు సంక్షేమం, మహిళల ఆరోగ్య పరిరక్షణ, కుటుంబ నియంత్రణ పద్ధతులపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు, విద్యార్థులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు