Thursday, March 6, 2025
Homeజిల్లాలువిజయనగరం6వ వార్డులలో బీసీ కార్పొరేషన్ లోన్లు పై అవగాహన సదస్సు

6వ వార్డులలో బీసీ కార్పొరేషన్ లోన్లు పై అవగాహన సదస్సు

విశాలాంధ్ర – విజయనగరం జిల్లా – రాజాం : భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు,సారధి నీటి సంఘం సభ్యులు మిత్తిరెడ్డి మధుసూదనరావు ఆధ్వర్యంలో రాజాం పురపాలక సంఘ పరిధి 6వ వార్డ్ సారథి లో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ టంకాల దుర్గారావు, నాలుగు మండలాల సీనియర్ నాయకులు హాజరుకావడం జరిగింది. ఈ కార్యక్రమంలో దుర్గారావు మాట్లాడుతూ “బీసీ కార్పొరేషన్ లోన్లు పట్ల అవగాహన కల్పించడం జరిగింది” మరియు పార్టీని సంస్థాగతగా బలోపేతానికి కృషి చేయాలి అన్నారు, అనంతరం నాలుగు మండలాల సీనియర్ నాయకులు దుర్గారావుకి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బురడ.అప్పలనాయుడు, ఉత్తరావల్లి.మోహన్రావు, పాలవలస.సింహాచలం, వియ్యపు.లక్ష్మి నాయుడు, ఆర్.నీలయ్య, పేరూరి.శ్రీనివాసరావు, ఎం.సూరిబాబు, వి.పోలినాయుడు, జి.నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు