Friday, March 14, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిసారా అనర్థాలపై అవగాహన సదస్సు

సారా అనర్థాలపై అవగాహన సదస్సు

ధర్మవరం ఎక్సైజ్ సీఐ చంద్రమణి
విశాలాంధ్ర ధర్మవరం/ముదిగుబ్బ; రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నవోదయం 2.0 లో భాగంగా అనంతరం excise డెప్యూటీ కమీషనర్ ఆదేశాలు మేరకు ధర్మవరం ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ముదిగుబ్బ మండలంలోని అడవిబ్రాహ్మణ తాండ, టిఎన్ పాళ్యం ,రాళ్ల అనంతపురం గ్రామాలలో నాటు సారా అనర్థాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ నాటు సారా తాగడం వల్ల దుష్పరిమాణాలు గురించి ప్రజలకు వివరించారు. అలాగే నాటు సారా త్రాగిన క్రయ విక్రయాలు చేసిన కఠిన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు. అనంతరం ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నరసింహులు,ధర్మవరం ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ చంద్రమణి , ధర్మవరం సబ్- ఇన్స్పెక్టర్స్ చాంద్ బాషా, నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు. వీరితోపాటు స్కూల్ హెడ్ మాస్టర్స్,రెవిన్యూ అధికారులు, వీఆర్వో, వీఆర్ఏలు, పంచాయతీ కార్యదర్శులు, మహిళా పోలీసులు, ఫారెస్ట్ అధికారులు,విలేజ్ కానిస్టేబులు, గ్రామ సర్పంచులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు