Tuesday, April 15, 2025
Homeజిల్లాలుఅనంతపురంసమానత్వ విలువల కోసం పోరాడిన వ్యక్తి బాబా సాహెబ్ అంబేద్కర్

సమానత్వ విలువల కోసం పోరాడిన వ్యక్తి బాబా సాహెబ్ అంబేద్కర్

సిపిఐ జిల్లా కార్యదర్శి సి. జాఫర్

విశాలాంధ్ర- అనంతపురం : భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని సోమవారం భారత కమ్యూనిస్టు పార్టీ, సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో మేధావి బాబా సాహెబ్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి సి. జాఫర్ మాట్లాడుతూ… సమానత్వం, స్వేచ్ఛ, జ్ఞానం, విలువల కోసం తన జీవితాంతం పోరాడరు డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ ఒక సామాన్య వ్యక్తిగా పుట్టి, అసాధారణంగా జీవించి, అసమాన్యంగా భారతదేశ చరిత్రను మలిచిన నేత అంబేద్కర్ అని కొనియాడారు. అణగారిన వర్గాలకు స్వరమవుతూ,చదువు ద్వారా చైతన్యాన్ని, రాజ్యాంగం ద్వారా హక్కులను అందించిన మహానాయకుడు అంబేద్కర స్ఫూర్తితో రాజ్యంగ కల్పించిన హక్కుల సాధన కోసం భారత కమ్యూనిస్టు పార్టీ, సిపిఐ దేశవ్యాప్తంగా మోడీ దుష్ట పాలనకు వ్యతిరేకంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. 2014 బిజెపి అధికారంలో వచ్చిన తర్వాత నిత్యవసర ధరలు, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్,ఆకాశాన్ని అంటుతు నిరుద్యోగ సమస్య కూడా తాండవిస్తోందన్నారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అతి గతి లేదన్నారు నోట్ల రద్దు వల్ల ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైంది అని పేర్కొన్నారు. నల్లధనం వెలికి తెస్తామని కాకమ్మ కథలు చెప్పడం జరిగిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను తెగ నమ్ముతూ ఆదాని అంబానీలకు దోచిపెడుతున్నారన్నారు. దళితుల పైన ఆదివాసుల పైన ముస్లిం మైనార్టీల పైన దాడులకు దిగుతున్నారన్నారు. భారతదేశంలో ఉన్న ఖనిజ సంపదను బహుళ జాతి కంపెనీలకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రశ్నించే వారి గొంతులను నొక్కుతున్నారన్నారు. వాక్ స్వాతంత్రం లేకుండా ప్రజాస్వామ్యం లేకుండా నియంత పాలన చేస్తున్నారన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను పార్లమెంటులో కేంద్ర హోం మంత్రి అమిత్ షా అవమానపరచడం జరిగిందన్నారు మూడు వ్యవసాయ నల్ల చట్టాలు వెనక్కు తీసుకుని దొడ్డి దారిన అమలు చేసి రైతుల నడ్డి విరిచారు అన్నారు. వక్ఫ్ సవరణ చట్టం తీసుకొని వచ్చి ఆగమేఘాల మీద అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు. అందుకే లౌకిక భావాలు ఉన్న వారందరూ ఐక్యంగా ఎన్డీఏ కూటమి తూర్పారబెట్టాలని భాజాపా, ఆర్ఎస్ఎస్ సంఘ పరివార్ శక్తులను ఓడించి తరిమికొట్టాలని ప్రజలకు పిలుపనిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి.నారాయణస్వామి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు లింగమయ్య,బావిగడ్డ రమణ,సంతోష్ కుమార్ సిపిఐ నగర కార్యదర్శి సహాయ కార్యదర్శి అలిపిర నగర కార్యవర్గ సభ్యులు నారాయణస్వామి, రామయ్య,వరలక్ష్మి,రజాక్,సుందర్ రాజు, వి. కృష్ణుడు,ఈ.ప్రసాద్,జయలక్ష్మి, శ్రీనివాస్,రాజు, నాగప్ప, యశోదమ్మ, ఈశ్వరయ్య ఏ ఐ వై ఎఫ్ నాయకులు సురేంద్ర, సింహ,సమీర్ పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు