Thursday, January 9, 2025
Homeజిల్లాలుఅనంతపురంకిడ్నీ సంబంధిత బాధితరాలకు ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ చేయూత

కిడ్నీ సంబంధిత బాధితరాలకు ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ చేయూత

విశాలాంధ్ర-శెట్టూరు : కిడ్నీ సంబంధిత అనారోగ్యం తో బాధపడుతున్న బోయ సరస్వతికి ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ ఆర్థిక సహాయం అందించాడు మండలం పరిధిలో లక్ష్మంపల్లి గ్రామానికి చెందిన బోయ సరస్వతమ్మ గత 3 నెలలుగా కిడ్నీలు ఫెయిల్ అవ్వడంతో వారానికి మూడు సార్లు డయాలసిస్ చేయాల్సింది.మందులు రావాణా తదితర వాటి కోసం వారానికి 8 వేల వరకు ఖర్చు అవుతోంది చికిత్స కోసం చేతిలో చిల్లి గవ్వ లేక,ఎక్కడ అప్పు కూడా ఎక్కువ అవ్వడం వల్ల ఇబ్బంది పడుతున్నప్పుడు గ్రామ యువకుల సహాయంతో ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు బద్దేనాయక్ సంప్రదించగా గురువారం మాకొడికి పాఠశాలలో విరామ సమయంలో సరస్వతమ్మ కుమారుడు అశోక్ 15,000/- ఆర్థిక సహాయం ని అందించి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు ఆపదలో ఉన్న మా గ్రామం వారిని ఆదుకున్నందుకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు ఈశ్వరమ్మ గ్రామస్తులు లక్ష్మణ్, శ్రీధర్, వంశీ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు