న్యూదిల్లీ: పంచదార ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఎగుమతులను తక్షణం నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దేశీయంగా చక్కెర ధరలు పెరగకుండా, సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ పరిధిలోని విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం… ముడి, తెల్ల, శుద్ధి చేసిన చక్కెరలకు ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టంచేసింది. ఈ నిషేధం మే 13 నుంచి సెప్టెంబర్ 30 వరకు లేదా తదుపరి ఆదేశాలు జారీ అయ్యేంతవరకు ఈ నిషేధం కొనసాగుతుందని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే… ఈ ఉత్తర్వులకు ముందే లోడింగ్ ప్రారంభమైనా, చక్కెర నిల్వలను కస్టమ్స్‌కు అప్పగించినా వాటి ఎగుమతులకు అనుమతిస్తామని వెల్లడించింది. కాగా…ఇప్పటికే కుదిరిన ఒప్పందాల ప్రకారం ఐరోపా, అమెరికాకు ఈ ఎగుమతుల నిషేధం వర్తించదని ప్రభుత్వం పేర్కొంది.
పంచదార ఎగుమతులపై నిషేధం
- Advertisement -
RELATED ARTICLES


