Homeజిల్లాలుఅనంతపురంఅరటి తోట దగ్ధం..అన్నదాత కష్టం అగ్నికి ఆహుతి..

అరటి తోట దగ్ధం..అన్నదాత కష్టం అగ్నికి ఆహుతి..

- Advertisement -

విశాలాంధ్ర, ఉరవకొండ..ఎన్నో ఆశలతో సాగు చేసిన అరటి తోట అగ్నికి ఆహుతికావడంతో ఓ రైతు కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. వజ్రకరూరు మండలం తట్రకల్లు గ్రామానికి చెందిన రైతు ఆవుల వెంకటరమణ కుటుంబానికి ఆధారంగా నిలుస్తుందనే ఆశతో ఐదు ఎకరాల్లో అరటి సాగు చేశారు. అయితే శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తులు తోటకు నిప్పంటించడంతో మొత్తం తోట మంటల్లో కాలిపోయింది. కొన్ని నెలలుగా శ్రమించి పెంచుకున్న అరటి చెట్లు కళ్లముందే అగ్నికి ఆహుతవుతుండటాన్ని చూసి రైతు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనలో సుమారు రూ.10 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు రైతు కుమారుడు సందీప్ తెలిపారు.ఇప్పటికే సాగు ఖర్చులు, అప్పులతో ఇబ్బందులు పడుతున్న సమయంలో ఈ ఘటన తమ కుటుంబాన్ని మరింత కుంగదీసిందని రైతు వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం తక్షణ సాయం అందించాలని కోరారు.గుర్తుతెలియని వ్యక్తులు కావాలనే తోటకు నిప్పంటించారని అనుమానం వ్యక్తమవుతుండగా, ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులను గుర్తించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు