Saturday, April 19, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిబ్యాంకు సమ్మె వాయిదా..

బ్యాంకు సమ్మె వాయిదా..

యు ఎఫ్ డి యు పట్టణ కన్వీనర్ గోపాల్ నాయక్
విశాలాంధ్ర ధర్మవరం:; ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈనెల 24 వ తేదీ 25వ తేదీ ఉద్యోగుల సమ్మెను వాయిదా వేస్తున్నట్లు పట్టణ యూఫ్డియు కన్వీనర్.(ఎస్బిఐ.) గోపాల్ నాయక్, రీజినల్ కార్యదర్శి ఎస్ యు ఏ సి(ఎస్బిఐ) రాజశేఖర్, వేణు. ఓఏ రీజినల్ కార్యదర్శి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ బ్యాంకులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనని, దేశంలో ఎక్కడా లేని సేవలను ఎస్బిఐ బ్యాంకు అందిస్తుందని, ఇందుకోసం ఎస్బిఐ ఉద్యోగులు సిబ్బంది ఎంతో కృషి చేస్తూ దేశంలోనే ఉన్నతమైన ఎస్బిఐ బ్యాంకుగా గుర్తింపు పొందడం జరిగిందని తెలిపారు. అటువంటి ఎస్బిఐ లో ఉద్యోగుల యొక్క సమస్యలను తీర్చలేక పోవడం వలన ఈ నెల 24 అండ్ 25వ తేదీలలో దేశవ్యాప్తంగా బ్యాంకు బంద్ నిర్ణయించడం జరిగిందని తెలిపారు. కానీ శుక్రవారం బాంబేలో ఐబీఏ, యు ఎఫ్ డి యూ, ప్రభుత్వ ప్రతినిధుల మధ్య చర్చలు జరగడం జరిగిందని కొన్ని డిమాండ్లను అంగీకరించడం జరిగిందని తెలిపారు. మిగిలిన డిమాండ్లను పరిష్కరించాల్సిన అవసరం ఉందని వారు తెలిపారు. అందుకే బ్యాంకు ఉద్యోగుల యొక్క డిమాండ్లను కొన్ని అంశాలను పరిష్కరించినందుకు అంగీకరించినందున ఈనెల జరగబోయే 24వ తేదీ నుండి 25వ తేదీ వరకు బ్యాంకు సమ్మెలను పూర్తిగా వాయిదా వేయడం జరిగిందని తెలిపారు. ఏప్రిల్ మూడవ వారంలో మా మిగిలిన డిమాండ్లను పరిష్కరించకపోతే తిరిగి సమ్మెలోకి వెళ్లడం జరుగుతుందని వారు స్పష్టం చేశారు. మొత్తం మీద ఈ రెండు రోజుల బ్యాంకు సమ్మె ప్రజలకు కొంత ఇబ్బంది ఉంటుంది అన్న అనుమానానికి పరిష్కారం జరగడం, ప్రజలు కూడా బ్యాంకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు