విశాలాంధ్ర -ధర్మవరం; ధర్మవరం బార్ అసోసియేషన్ నూతన కమిటీని సీనియర్, జూనియర్ న్యాయవాదులు ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ధర్మవరంలోని కోర్టులోనున్న బార్ అసోసియేషన్ కార్యాలయంలో గురువారం నూతన కమిటీని ఎంపిక చేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఎంఏ ఖరీమ్, ప్రధాన కార్యదర్శిగా డీఎల్ఎన్ మూర్తి, ఉపాధ్యక్షుడుగా నూర్ మహమ్మద్, సహాయ కార్యదర్శిగా బాలనుందరి, కోశాధికారిగా అబ్దుల్ సాబ్, కమిటీ సభ్యులుగా కెఎం రేష్మ, శివకుమార్, మోహన్ ప్రసాద్, నరసింహమూర్తి, పెద్దన్న, బాబా ఫకృద్దిన్, ప్రసాద్, మణికంఠలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీ సభ్యులకు సీనియర్, జూనియర్ న్యాయవాదులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు ఖరీమ్ మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. ప్రధాన కార్యదర్శి డీఎల్ఎన్ మూర్తి మాట్లాడుతూ ఏడాదిపాటు న్యూస్ పేపర్, తాగునీటి వసతిని బార్ అసోసియేషన్ ఆఫీస్ కి ఉచితంగా తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేస్తానని హామి ఇచ్చారు.
బార్ అసోసియేషన్ నూతన కమిటి ఎంపిక
RELATED ARTICLES