Homeతెలంగాణఅలియాబాద్ మున్సిపాలిటీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

అలియాబాద్ మున్సిపాలిటీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

- Advertisement -

ఆట పాటలతో సందడి చేసిన మహిళలు..
వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి,
మాజీ జడ్పీ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి..
తెలంగాణ సంస్కృతి చిహ్నం బతుకమ్మ పండుగ అన్న వక్తలు..

విశాలాంధ్ర, శామీర్ పేట్ :- తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన బతుకమ్మ సంబరాలు అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో వైభవంగా జరిగాయి. మున్సిపల్ చైర్‌పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించగా ఈ వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. కాగా ఈ వేడుకలకు మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కోమలత, మున్సిపల్ వైస్ చైర్‌ పర్సన్ మాలతి మాధవ రెడ్డి, కౌన్సిలర్లు, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు, మున్సిపల్ అధికారులు, కార్యాలయ సిబ్బంది, మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయబద్ధంగా బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో ఇటువంటి పండుగలు కీలక పాత్ర పోషిస్తాయని వేడుకలకు హాజరైన వారు పేర్కొన్నారు.
మహిళల పెద్ద ఎత్తున పాల్గొనడంతో బతుకమ్మ వేడుకలు పండుగ వాతావరణంలో ఘనంగా జరిగాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు